జిల్లాలో చేపపిల్లల విడుదల.. 1.93 కోట్ల పిల్లలు సిద్ధం
WGL: జిల్లా జలాశయాల్లో చేప పిల్లల విడుదల కార్యక్రమం మరో 4 రోజుల్లో ప్రారంభమవుతుంది. మంత్రి వాకిటి శ్రీహరి సూచనల మేరకు 1.93 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయనున్నారు. మైలారం రిజర్వాయర్‌తో పాటు 706 చెరువుల్లో 189 మత్స్య సంఘాల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సంఘాల్లో 15,821 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది టెండర్ భీమవరం జస్వంత్ ఆక్వా ప్రైవేట్‌కు లభించింది.