అధ్వానంగా రోడ్డు.. ప్రయాణికుల అవస్థలు

NRPT: ఉట్కూర్ మండలం బిజ్వార్ నుంచి అసులోనిపల్లి వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణం చేయడం ప్రాణాలకు ప్రమాదకరమని, ముఖ్యంగా రాత్రివేళ గుంతలు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.