VIDEO: అధ్వానంగా మారిన కొత్తకోట రోడ్డు

AKP: రావికమతం మండలం కొత్తకోటలో రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాలు విస్తారంగా పడడంతో ఈ రోడ్డుపై వర్షపు నీరు చేరి మరి దారుణంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ఆర్ అండ్ బీ అధికారులు స్పందించి తక్షణమే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.