'రెండేళ్లలో చంద్రబాబు చేసిన అప్పు రూ. 3.52 లక్షల కోట్లు'
AP: తమ హయాంలో తెచ్చిన పథకాలన్నీ కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారన్నారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు రూ. 3.52లక్షల కోట్లు అప్పులు చేశారని.. ఆ డబ్బులన్నీ ఎవరి జేబులోకి పోయాయని ప్రశ్నించారు. తాము డీబీటీ ద్వారా రూ. 2.73లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశామన్నారు.