రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
కాకినాడ రైల్యే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. పండుగల రద్దీ దృష్ట్యా చర్లపల్లి నుంచి కాకినాడకు(07196) ఈనెల 24 నుంచి 30 వరకు ప్రతీ మంగళ, బుధవారాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే, కాకినాడ టౌన్ నుంచి (07195) ఈనెల 28 నుంచి 31 వరకు ఆది, బుధవారాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు.