'టన్నుకు రూ.40 వేల నష్ట పోతున్నాం'

'టన్నుకు రూ.40 వేల నష్ట పోతున్నాం'

కోనసీమ: ఇరాన్-అమెరికా యుద్ధం పేరుతో వనామీ ధరలు తగ్గించి ఆక్వా రైతులను నష్టపరుస్తున్నారని కోనసీమ ఆక్వా రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు చవటపల్లి నాగభూషణం ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టన్నుకు రూ.40 వేల వరకు నష్టపోతున్నామని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధర ఇవ్వాలన్నారు.