CMRF చెక్కు పంపిణీ చేసిన మాజీ కౌన్సిలర్

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధి ఆరో వార్డులో మాజీ కౌన్సిలర్ భీమయ్య యాదగిరి బుధవారం CMRF చెక్కు పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేసుకున్న బీర సత్యనారాయణ CMRF కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో బాధితుడికి రూ 60 వేల నిధులు మంజూరయ్యాయి. నేడు సత్యనారాయణకు చెక్కు అందజేశారు.