ఈల చెట్లదిబ్బలో పీతల వేట పేరుతో చిత్రహింసలు
కృష్ణా: నాగాయలంక (M) ఈల చెట్లదిబ్బలో తక్కువ జాతి వారిని బంధించి వెట్టి చాకిరి చేయిస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపాయి. పీతల వేట పేరుతో తీసుకొచ్చి మద్యం అలవాటు చేసి దొంగ లెక్కలు చూపి బందీలుగా మార్చి హింసిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మహిళలు, చిన్నారులపై దాడులు పాల్పడి బెదిరిస్తున్నారని వాపోయారు. అధికారులు స్పందించి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.