కరెంట్ షాక్‌తో రైతు మృతి

కరెంట్ షాక్‌తో రైతు మృతి

NZB: మెండోరో మండలం వెల్గటూర్ గ్రామంలో షేక్ మస్తాన్ అనే రైతు కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని స్థానిక ఎస్ఐ సుహాసిని తెలిపారు. రోజులానే మంగళవారం అతడు తన తోటలో నీళ్ల కోసం స్టార్టర్ ఆన్ చేయగా కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్ఐ వెల్లడించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.