సుంకేశ్వరిలో వైసీపీ కార్యకర్త మృతి

సుంకేశ్వరిలో వైసీపీ కార్యకర్త మృతి

KRNL: మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ కార్యకర్త బీరప్ప శుక్రవారం మృతి చెందారు. బీరప్ప మృతదేహానికి కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఓదార్చారు. రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. పార్టీ పరంగా బీరప్ప కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.