'సమాన వాటా కోసం పోరాడిన దార్శనికుడు అంబేద్కర్'
MNCL: మంచిర్యాలలోని ఆర్టీసీ బస్ స్టేషన్‌లో శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా బస్ స్టేషన్ ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అంటరానితనం, సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాలకు సమాన వాటా కోసం పోరాడిన దార్శనికుడు అంబేద్కర్ అని కొనియాడారు.