వైసీపీకి షాక్... టీడీపీలోకి చేరికలు..!
KRNL: మంత్రాలయం మండలం మాధవరం, చెట్నీహళ్లి గ్రామాలకు చెందిన సుమారు 20 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాహిత పాలనకు, అలాగే మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ చేరిక జరిగినట్లు వారు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.