ఉపాధి హామీ పనుల్లో విగ్రహం లభ్యం

ఉపాధి హామీ పనుల్లో విగ్రహం లభ్యం

JN: జిల్లా పరిధిలోని శామీర్ పేట గ్రామంలో ఈరోజు ఉదయం ఉపాధి హామీ పథకం పనిలో భాగంగా ఆవునూరి మల్లారెడ్డి వ్యవసాయ పొలం వద్ద కూలీలు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కూలీలకు ఓ ప్రాచీన విగ్రహం కనిపించింది. ముక్కు, నోరు, కళ్ళు, చెవులతో కూడిన తల దొరికింది. ఈ విగ్రహాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.