విద్యార్థులకు కథల పుస్తకాల పంపిణీ
NLG: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, సమగ్ర వికాసానికి కథలు ఎంతగానో దోహదపడతాయని పిల్లల కథా రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి తెలిపారు. నల్గొండ మండలం గుట్ట కింది అన్నారం ప్రాథమిక పాఠశాలకు తాను రాసిన బంతిపూలు, బహుమతి, మొలకలు, ఊగుతున్న ఉయ్యాల, చేతిరాత వంటి పుస్తకాలను ఉచితంగా అందజేశారు. పిల్లలు చిన్నప్పటి నుంచే కథలు చదివే అలవాటు చేసుకోవాలని సూచించారు.