VIDEO: పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన జనం
ASF: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల నేపథ్యంలో ఇంధన కొరత తలెత్తుతుందన్న ప్రచారంతో వాహనదారులు బంకులకు పోటెత్తారు. ఆసిఫాబాద్‌లో పలు పెట్రోల్ బంకులు శుక్రవారం రద్దీగా కనిపించాయి. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా వాహనదారులు ట్యాంకులను నింపుకోవడానికి పోటీ పడ్డారు. చమురు కొరతపై అధికారిక ప్రకటన లేకపోయినా, జనం ఆందోళనతో బంకుల వద్ద బారులు తీరారు.