'ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి'
WNP: ఉపాధి కూలీలకు అత్యవసర సౌకర్యాలను కచ్చితంగా కల్పించాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. ఖిల్లా గణపురం మండలంలోని ఉప్పరపల్లిలో ఉపాధి పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడి వారే ఇబ్బందులను తెలుసుకున్నారు. 2,3 నెలలుగా వేతనాలు ఖాతాలో జమ కావడం లేదని కూలీలు ఫిర్యాదు చేశారు. ఈ వారంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.