'ఈనెలాఖరులోపు 10 తరగతి సిలబస్ పూర్తి చేయాలి'
AKP: ఈ నెలాఖరులోపు 10 తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయాలని డీఈఓ అప్పారావు నాయుడు ఆదేశించారు. శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు వందరోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. వచ్చే నెల 6 నుంచి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ప్రతిరోజు సాయంత్రం చదివిన సబ్జెక్టుపై పరీక్షలు జరపాలన్నారు. ఫిబ్రవరి 9 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలన్నారు.