'ఎమ్మెల్యే సభ్యత్వాన్నిరద్దు చేయాలని'
NLG: శాసనసభ సభ్యులు కడియం శ్రీహరి 40 సంవత్సరాలుగా అనుభవం ఉన్న నాయకుడిపై సభలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇలా వ్యవహరించటం బాధకరమని కాంగ్రెస్ నాయకులు తప్పుబట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఇలా అనుభవం ఉన్న వ్యక్తిని 'చంపుతాం' అని బెదిరించడంపై మండిపడ్డారు. వెంటనే కౌశిక్‌రెడ్డి సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.