విశాఖకు మరిన్ని డేటా సెంటర్లు

విశాఖకు మరిన్ని డేటా సెంటర్లు

VSP: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మరిన్ని డేటా సెంటర్లు రానున్నాయి. ప్రముఖ ఐటీ సంస్థ కంట్రోల్-ఎస్ 350MW సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. నిన్న మరో రెండు కంపెనీలు కూడా విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలించాయి. భూములపై కంపెనీల సానుకూల ప్రతిపాదనలు వస్తే, క్యాబినెట్ భేటీలో భూముల కేటాయింపులపై ఆమోదం తెలిపే అవకాశం ఉంది.