సామూహికంగా సర్వదోష నివారణ యజ్ఞం
MDCL: మేడ్చల్ సాయి గీత ఆశ్రమంలో సర్వ దోష నివారణ మహా సామూహికంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా సాయికుమార్ బాబా మాట్లాడుతూ.. ప్రజలు వీలైనంతవరకు ఓపిక, సహనంతో ఉంటూ స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. సర్వ దోష నివారణ మహా యజ్ఞంలో భాగంగా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు సామూహికంగా కొబ్బరికాయలను కొట్టి ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించారు.