ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి: ఎమ్మెల్యే

TPT: తిరుపతి గాంధీ రోడ్డులోని హథీరాంజీ మఠం భవనం చుట్టూ శిథిలావస్థలో ఉన్న దుకాణాలు తొలగించే ప్రక్రియపై ఎమ్మెల్యే శ్రీనివాసులు సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య, ప్రజా ప్రతినిధులు, అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సమావేశం అయ్యారు. కాగా, చుట్టూ ఉన్న షాపులను వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.