రామోజీకుమ్మరిగూడెం సర్పంచ్‌గా.. భూక్యా సుశీల
WGL: వర్ధన్నపేట మండలం రామోజీకుమ్మరిగూడెం గ్రామ పంచాయతీలో సర్పంచ్‌గా భూక్యా సుశీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇల్లంద క్లస్టర్ కేంద్రంలో ఎన్నికల అధికారి వేణు అధికారిక ధ్రువీకరణ పత్రం అందజేశారు. గ్రామంలోని అన్ని వార్డులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. గ్రామస్థులు సంబరాలు నిర్వహించి సుశీలను అభినందించారు. ఉప సర్పంచ్ ఎంపిక త్వరలో జరగనుంది.