అంతర్జాతీయ క్రీడల్లో బాషా ప్రతిభ అభినందనీయం: డీఈవో
NDL: ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో ఉత్తమ ప్రశంసా పత్రం దక్కించుకున్నారు. అనంతరం రాష్ట్రానికి చేరుకున్న సంజామల ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయమ సంచాలకులు బాషా ఇవాళ ఎంఈవో వెంకట రమణారెడ్డితో కలిసి జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ క్రీడల్లో PD బాషా ప్రతిభ అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.