విజులెన్స్ అధికారుల మెరుపు దాడులు
RR: ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో నిన్న విజులెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ DG శిఖాగోయెల్ ఆదేశాల మేరకు అధికారులు ఇక్కడ తనిఖీలు నిర్వహించారు. పథకాల అమలు, నిధుల వినియోగానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పూర్తి స్థాయిలో విచారణ ముగిసిన తరువాత వివరాలను వెల్లడిస్తాం అని విజలెన్స్ బృందం స్పష్టం చేసింది.