ఆయుధ నిల్వల ఆరోపణలు.. రాజ్‌భవన్‌లో తనిఖీలు

ఆయుధ నిల్వల ఆరోపణలు.. రాజ్‌భవన్‌లో తనిఖీలు

పశ్చిమ బెంగాల్ రాజ్‌భవన్‌లో ఆయుధాలను నిల్వ చేశారంటూ టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆనంద బోస్ రాజ్‌భవన్‌లో తనిఖీలు చేయించారు. ఆయుధాల సామాగ్రిని నిల్వ చేశారా? అని గుర్తించేందుకు కోల్‌కతా పోలీసులు కేంద్ర బలగాలు, బాంబు, డాగ్ స్క్వాడ్‌లతో కూడిన బృందం సోదాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.