VIDEO: రెచ్చిపోయిన దోపిడీ దొంగలు

VIDEO: రెచ్చిపోయిన దోపిడీ దొంగలు

RR: దోపిడీ దొంగలు రెచ్చిపోయిన ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్ పూర్ గ్రామంలోని ఓం నగర్ కాలనీలో ఓ ఇంట్లోకి అర్ధరాత్రి దొంగలు చొరపడ్డారు. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇంట్లోకి చొరబడిన దొంగలు 30 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు సమాచారం. కాగా.. దొంగలు చొరబడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.