నేడు జిల్లాకు మంత్రి సంధ్యారాణి

అల్లూరి: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం అరకులోయ, పాడేరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అరకులోయలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు భవనాలను, డుంబ్రిగుడ మండలం కించుమండ వంతెనను ప్రారంభిస్తారు. అనంతరం పాడేరు చేరుకుని ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో పాల్గొననున్నారు.