ఘనంగా సీతారామచంద్రస్వామి కార్యక్రమం
WGL: రంగశాయిపేటలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఇవాళ అర్చకులు నిత్య హౌపాసన అనంతరం బలిహరణ కార్యక్రమాన్ని వేద బ్రాహ్మణులు అత్యంత వైభవంగా నిర్వహించారు. లోకంలో అతివృష్టి, అనావృష్టి వంటి బాధలు రాకుండా దిక్కుల అధిపతులకు మంత్రాలతో బలి ప్రధానం చేయడం ఈ ఉత్సవంలో ముఖ్య ఘట్టం. ఈ కార్యక్రమంలో యాగ్నిక బ్రాహ్మణులు శ్రీమాన్ రాఘవచారి, నరసింహమూర్తిశాస్త్రి పాల్గొన్నారు.