పాతపట్నంలో విశేష పూజలతో నీలకంఠేశ్వర స్వామి

పాతపట్నంలో విశేష పూజలతో నీలకంఠేశ్వర స్వామి

శ్రీకాకుళం: పాతపట్నం గ్రామంలో మహేంద్ర తనయా నది పక్కన వెలసిన నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం భాద్రపదం నెల చతుర్థి అనంతరం వచ్చిన మొదటి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆలయ అర్చకులు ఆర్ పార్వతీశం తెలిపారు. ఈరోజు స్వామివారికి ప్రీతిపాత్రమైన రోజు కనుక భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదములు తీసుకున్నారని వెల్లడించారు.