మహిళా సంఘ భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల, మోతె గ్రామాల్లో రూ. 20 లక్షలతో చేపట్టిన రెండు మహిళా సంఘ భవనాల నిర్మాణానికి డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ భవనంలో నూతన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నక్క హరీశ్, ఉపసర్పంచ్ ముద్దం మల్లేశం, స్థానిక నాయకులు, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.