చైనాకు నౌక మళ్లింపు.. చెల్లింపులు కారణం కాదు: కేంద్రం

చైనాకు నౌక మళ్లింపు.. చెల్లింపులు కారణం కాదు: కేంద్రం

ఇరాన్ ముడిచమురును మనదేశానికి తీసుకువస్తున్న ఓ నౌక చైనాకు వెళ్తోందని ఇటీవల వార్తలొచ్చాయి. ఈ గమ్యస్థానం మారడానికి చెల్లింపులు కారణమని వాటిలో పేర్కొన్నారు. దీనిపై భారత పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ స్పందించింది. నౌక దారి మళ్లడానికి చెల్లింపులు కారణం కాదని తెలిపింది. ట్రేడ్ ఆప్టిమైజేషన్‌లో భాగంగా కొన్నిసార్లు నౌకలు గమ్యస్థానాలు మార్చుకుంటాయని స్పష్టం చేసింది.