తీరం దాటిన వాయుగుండం

ASR: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని గోపాల్‌పూర్ వద్ద తీరం దాటింది. దీంతో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి 40 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.