ప్రతిష్టాపన ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి
NRML: సారంగాపూర్ మండలం అడెల్లిలోని ప్రసిద్ధ మహా పోచమ్మ ఆలయ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం సాయంత్రం పరిశీలించారు. శుక్రవారం జరిగే ఉత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను, నిర్వాహకులను ఆదేశించారు