తరిగొప్పలలో తల్లిపాల వారోత్సవాలు

కృష్ణా: ఉంగుటూరు(M) తరిగొప్పలలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం డాక్టర్ శిరీష అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పుట్టిన బిడ్డకు మురిపాలు తాగించటం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఆరు నెలల వయసు వరకు తల్లిపాలే ఆహారంగా ఇవ్వాలన్నారు. తల్లి తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా పాలు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయన్నారు. తల్లులు శుభ్రత పాటించాలన్నారు.