VIDEO: అతి భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క

MLG: అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. సహాయక చర్యల కోసం ఫ్లడ్ మేనేజ్‌మెంట్ కమిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.