విమాన సేవలు రద్దు.. స్పందించిన రాహుల్
ఇండిగో విమాన సేవల్లో అంతరాయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇండిగో వైఫల్యానికి ప్రభుత్వ గుత్తాధిపత్య నమూనా కారణమని అన్నారు. విమాన ప్రయాణ ఆలస్యాలు, విమానాల రద్దుతో భారతీయులే భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని తెలిపారు. కాగా, గత రెండు రోజులుగా ఇండిగో విమాన సేవల్లో అంతరాయం కలిగిన విషయం తెలిసిందే.