పెనుకొండలో కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డికి నివాళులు

సత్యసాయి: పెనుకొండ మండల కేంద్రంలోని శ్రీకృష్ణదేవరాయ కాలనీలో సీపీఐ డివిజన్ కార్యదర్శి శ్రీరాముల నేతృత్వంలో శనివారం కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కమ్యూనిస్టు పార్టీకి సురవరం సుధాకర్ రెడ్డి చేసిన సేవలు సీపీఐ నాయకులు కొనియాడారు. ఆయన మృతి చెందడం బాధాకరమని పార్టీకి తీరని లోటని తెలిపారు.