వృద్ధ తల్లిని పట్టించుకోని కొడుకులు

GNTR: నంబూరు గ్రామానికి చెందిన మాణిక్యమ్మను కొడుకులు పట్టించుకోకపోవడంతో ఆమె పెదవడ్లపూడిలో అద్దె ఇంట్లో జీవిస్తోంది. కాలికి గాయం కావడంతో కన్నీటి జీవితం గడుపుతోన్న ఆమెను, మంగళవారం మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ తనయుల వద్దకు తీసుకెళ్లాడు. ఇంటిలోకి రానివ్వకపోవడంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభమైంది.