కార్యకర్తల ఆత్మీయ సమావేశం

ELR: లింగపాలెం మండలం ములగలంపాడు గ్రామంలో రంగాపురం పీఎసీఎస్ ఛైర్మన్ ఇనుగంటి దినేష్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తే అధినేత అనే నినాదంతో పని చేస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నలువైపుల నుంచి నాయకులు, సర్పంచ్ ముసునూరు రాము, తదితరులు పాల్గొన్నారు.