రాయదుర్గంలో వైసీపీకి బిగ్ షాక్
ATP: రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన 42 మంది ముఖ్య వైసీపీ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వైస్ సర్పంచ్‌లు సహా మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ మండల అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో కమలం గూటికి చేరారు.