VOAలకు వేతనం అమలు చేయాలి: CITU

GDWL: జిల్లాలో IKP, VOAలకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రూ. 20 వేల వేతన హామీని అమలు చేయాలని CITU జిల్లా అధ్యక్షుడు ఏ.వెంకటస్వామి డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం హామీని నెరవేర్చకపోగా, కొత్త పనులు అప్పగించి ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.