VIDEO: జనాభా గణన శిక్షణ శిబిరాన్ని సందర్శించిన ఆర్డివో
SRPT: జనాభా గణన ప్రక్రియను ఎన్యూమరేటర్లు బాధ్యతాయుతంగా నిర్వహించాలని కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ సూచించారు. ఈరోజు కోదాడ పట్టణంలోని కేఆర్ఆర్ జూనియర్ కళాశాలలో జరుగుతున్న, అర్బన్ జనాభా గణన రెండో బ్యాచ్ శిక్షణ శిబిరాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇళ్ల జాబితా తయారీలో ఏ ఒక్క ఇంటిని వదిలిపెట్టకుండా జనాభా గణన చేయాలని సూచించారు.