ధర్మాపూర్‌లో పోలింగ్ ఆలస్యం
MBNR: జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాగా ధర్మాపూర్ మండలంలో పోలింగ్ ఇంకా మొదలుకాలేదు. విద్యుత్ సరాఫరా నిలిచిపోవడంతో పోలింగ్ ప్రారంభం ఆలస్యం అవుతోందని ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే ఇంకా పోలింగ్ ప్రారంభం కాకపోవడంపై అభ్యర్థులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.