పీఎం కిసాన్ కార్యక్రమం
SDPT: జగదేవపూర్ మండల కేంద్రంలో కొయంబత్తూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసిన పీఎం కిసాన్ కార్యక్రమంను రైతులతో కలిసి వీక్షణం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి రైతులకు 21వ విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి వసంత రావు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు.