VIDEO: శివాలయంలో కార్తీక దీపారాధనతో భక్తిపారవశ్యం
NZB: బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో కార్తీక మాసం పురస్కరించుకుని ఇవాళ ఉదయం మహిళలు వేకువ జామున ఆలయానికి వచ్చి కార్తీక దీపారాధన నిర్వహించారు. కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో స్వామివారికి అభిషేకం, హారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రాలతో ఆకాశ దీపారాధన కార్యక్రమం జరిగిందని అర్చకులు గణేష్ శర్మ తెలిపారు.