VBIDEO: అమాంతంగా పెరిగిన చలి
E.G: గోకవరం మండలంలో చలి తీవ్రత అమాంతం పెరిగింది. ఆదివారం రాత్రి వీచిన చలిగాలులకు ప్రజలు వణికిపోయారు. ఏజెన్సీ ముఖద్వారం కావడంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో స్థానికులు చలిమంటలను ఆశ్రయించి సేదతీరుతున్నారు. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.