'ఆర్వో శిక్షణను పర్యవేక్షించాలి'
జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ. రాణి కుముదిని గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మొదటి దశ పోలింగ్ జరగనున్న మండలాల ప్రత్యేక అధికారులు బ్యాలెట్ పత్రాల వెరిఫికేషన్, రిటర్నింగ్ ఆఫీసర్ల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.