ఎలాంటి అనుమతులు లేకుండా పల్లె ప్రకృతి వనం ధ్వంసం

ఎలాంటి అనుమతులు లేకుండా పల్లె ప్రకృతి వనం ధ్వంసం

ASF: కౌటల మండలం బోదంపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనంను ధ్వంసం చేసి ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారని పలువురు గ్రామస్థులు మండిపడ్డారు. శనివారం వారు మాట్లాడుతూ.. ఎటువంటి అనుమతి లేకుండా పల్లె ప్రకృతి వనంను ధ్వంసం చేసి అదే స్థలంలో IKP భవనం నిర్మించడం సరికాదన్నారు. IKP భవనం మరో చోట నిర్మించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.