దారుణం.. కన్న కూతురిని కడతేర్చిన తండ్రి

దారుణం.. కన్న కూతురిని కడతేర్చిన తండ్రి

KNR: కరీంనగర్ వావిలాలపల్లిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే.. కాల యముడై తన ఇద్దరు పిల్లలను హతమార్చేందుకు యత్నించాడు. తన కూతురు, కొడుకుకు అంగవైకల్యం కారణంగా ఉరివేసి చంపేందుకు తండ్రి మల్లేశం ప్రయత్నించాడు. కూతురుకు ఉరివేసి హత్యచేయగా, కుమారుడు ఆశ్రిత్‌కు ఉరివేసే సమయంలో భార్య రావడంతో పరారయ్యాడు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.