తీవ్ర ఎండలు… వైద్యుల సూచనలు పాటించండి..!

తీవ్ర ఎండలు… వైద్యుల సూచనలు పాటించండి..!

WGL: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అవసరం లేకుండా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లకూడదని తెలిపారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవడం మంచిదన్నారు. తేలికపాటి ఆహారం తీసుకోవడం, పలుచని బట్టలు ధరించడం మంచిదన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎండలో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.